ప్రొద్దుటూరు స్థానిక పాత బస్టాండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద సేవ్ ఇండియా అని సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి సత్యనారాయణ, కార్యదర్శి విజయ్ కుమార్ మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చి కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబించడం సరికాదన్నారు. మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ పట్టణ అధ్యక్షుడు చంటి, ప్రధాన కార్యదర్శి సాల్మన్, తదితరులు పాల్గొన్నారు.