తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సహకార శాఖపై సీఎం జగన్ సమీక్షించారు. సీఎం మాట్లాడుతూ.. 'ఏపీ వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉండాలంటే రైతులు, మహిళల ఆర్థిక స్థితి బలంగా ఉండాలి. వ్యవసాయ కార్యకలాపాలకు, మహిళలకు స్వయం ఉపాధి కార్యక్రమాలకు తక్కువ వడ్డీకి రుణాలు అందించాలి. ఈ లక్ష్య సాధనలో ఏపీసీఏబీ, జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు, పీఏసీఎస్, ఆర్‌బీకేలు భాగస్వాములు కావాలి' అని అన్నారు.