రేణుదేశాయ్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు స్పందించారు. 'అమ్మా రేణూ! మీ మాజీకి చెప్పు. మా క్యారెక్టర్లు పెట్టి శునకానందం పొందొద్దని !' అని అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. అంతకుముందు, పవన్ మూడు పెళ్లిళ్లపై వెబ్ సిరీస్ తీస్తామనడంపై రేణుదేశాయ్ ఓ వీడియో ద్వారా మాట్లాడుతూ... పవన్ కళ్యాణ్ డబ్బు మనిషి కాదని, ఆయనకు అవకాశం ఇవ్వాలని, తన రాజకీయ మద్దతు ఆయనకే అని రేణుదేశాయ్ గతంలో ఓ వీడియోలో తెలిపారు. మూడు పెళ్లిళ్ల అంశం వదిలి వేయాలని కోరారు. ఆయన పిల్లలనే కాదు.. ఎవరి పిల్లలనీ రాజకీయాల్లోకి లాగవద్దని కోరారు. మూడు పెళ్లిళ్ల అంశాన్ని విరమించుకోవాలని కోరారు. తన పిల్లలనే కాదు.. ఎవరి పిల్లలనూ రాజకీయాల్లోకి లాగవద్దని కోరారు.