అంగల్లు, పుంగనూరు ఘటనల్లో పోలీసులు చంద్రబాబుతో పాటు వందలాది మంది టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే 81 మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ క్రమంలో అరెస్టు అయిన వారి కుటుంబ సభ్యులతో చంద్రబాబు ఫోన్లో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. అధైర్య పడొద్దని, పార్టీ పూర్తి అండగా ఉంటుందని తెలిపారు. న్యాయ పోరాటం ద్వారా వారందరినీ సాధ్యమైనంత త్వరగా బయటకు తెస్తామని చెప్పారు.