పశ్చిమబెంగాల్ కోల్ కతాలో ఓ ట్రాన్స్ జెండర్ నుంచి రక్తం తీసుకునేందుకు ఆరోగ్య కార్యకర్తలు నిరాకరించారు. హెచ్ఐవీ (ఎయిడ్స్) వచ్చే అవకాశం అధికంగా ఉంటుందనే కారణంతో ఇలా చేసినట్లు తెలుస్తోంది. బన్ హుగ్లీలో రక్తదాన శిబిరంలో రక్తం ఇవ్వడానికి ట్రాన్స్ జెండర్ రాగా అనుమతించలేదు. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం జరిగింది. చాలా సేపటి వివాదం తర్వాత ఆరోగ్య సిబ్బంది అతని నుంచి రక్తం తీసుకున్నారు.