విశాఖపట్నంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. పవన్ కళ్యాణ్ రుషికొండ పర్యటనకు పోలీసు అధికారులు అనుమతి నిరాకరించారు. అయితే పర్మిషన్ లేకపోయినా తన పర్యటన కొనసాగుతుందని పవన్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. దీంతో విశాఖపట్నంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ముఖ్యనేతలతో సమావేశం అనంతరం పవన్ రుషికొండకు బయల్దేరనున్నారు.