కర్ణాటకలో ఇకపై ఆరేళ్లు వచ్చిన పిల్లలను మాత్రమే ఒకటో తరగతిలో చేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు ప్రభుత్వ నిర్ణయానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో 5.5 ఏళ్ల విద్యార్థులు ఒకటో తరగతి చదువుతున్నారు. 2025-26 నుంచి ఆరేళ్లు నిండిన వారిని మాత్రమే చేర్చుకోవాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం 2022లో ఈ విధానంపై ఆదేశాలివ్వగా, ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో అమలు వాయిదా పడింది.