ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగో విడత వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద పొదుపు మహిళల ఖాతాల్లో వడ్డీ డబ్బును విడుదల చేశారు. కోనసీమ జిల్లా అమలాపురం మండలం జనుపల్లిలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి నేరుగా నగదు జమ చేశారు. 9.48 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని 1,05,13,365 మంది మహిళల బ్యాంకులకు చెల్లించిన రూ.1,353.76 కోట్ల వడ్డీని రీయింబర్స్ చేస్తూ వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు.