ఆన్లైన్ గేమింగ్, క్యాసినో, గుర్రపు పందేలపై 28 శాతం పన్ను విధించాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది. దీనికి సంబంధించిన బిల్లును కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ ఇవాళ లోక్సభలో ప్రవేశపెట్టారు. సభలో నిరసనల మధ్యే కేంద్ర వస్తుసేవల పన్ను (సవరణ) బిల్లు 2023, ఇంటిగ్రేటెడ్ వస్తుసేవల పన్ను (సవరణ) బిల్లు 2023లకు లోక్సభ ఆమోదం తెలిపింది. వర్షాకాల సమావేశాల చివరి రోజు ఈ సవరణ బిల్లును తీసుకురావటం గమనార్హం.