వివేకా మర్డర్ కేసులో అజేయ్ కల్లం వేసిన పిటిషన్ పై రిజిస్ట్రీ అభ్యంతరం తెలిపారు. దీనిపై తెలంగాణ హైకోర్టు విచారణ జరపగా, తన వాంగ్మూలాన్ని తప్పుగా నమోదు చేశారని అజేయ్ వాదనలు వినిపించారు. వాదనలు విన్న కోర్టు.. నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఇదే కేసులో నిందితులు భాస్కర్, ఉదయ్ వేసిన బెయిల్ పిటిషన్లను విచారించిన కోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది.