ఉల్లి ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బఫర్ స్టాక్ నుంచి ఈ ఏడాది 3 లక్షల మెట్రిక్ టన్నుల ఉల్లి నిల్వల విడుదలను ప్రారంభించాలని వినియోగదారుల వ్యవహారాల శాఖ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి డిపార్ట్‌మెంట్ సెక్రటరీ రోహిత్ కుమార్ సింగ్ గురువారం NAFED మరియు NCCF మేనేజింగ్ డైరెక్టర్‌లతో సమావేశమయ్యారు. అనంతరం విధివిధానాలను ఖరారు చేశారు.