మణిపూర్లో అల్లర్లు జరుగుతుంటే ప్రధాని మోడీ పట్టించుకోలేదని, టైమ్ పాస్ చేశారని రాహుల్ గాంధీ ఆరోపించారు. లోక్సభలో గురువారం ప్రధాని నవ్వుతూ తమాషా చేశారని, ఇలాంటి వ్యవహార శైలి ప్రధానికి తగదన్నారు. మీడియాతో ఢిల్లీలో శుక్రవారం మాట్లాడారు. మణిపూర్లో హింస జరుగుతుంటే ఎందుకు ఆపలేకపోయారని ప్రశ్నించారు. భారతమాతను హత్య చేశారని తాను అనలేదని, 'మణిపూర్ను హత్య చేశారు.. రెండుగా చీల్చారు' అని తాను అన్నానన్నారు.