చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం అంగళ్లులో జరిగిన సంఘటనలో టీడీపీ నేతలు దేవినేని ఉమ, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిలకు సోమవారం వరకు హైకోర్టులో ఊరట లభించింది. వీరిరువురి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేయగా.. ఈరోజు విచారణ జరిగింది. పిటీషనర్ల తరపున సీనియర్ న్యాయవాదులు పోసాని వెంకటేశ్వర్లు, ఎన్వీ సుమంత్ వాదనలు వినిపించారు. తమకు వివరాలు అందించేందుకు సోమవారం వరకు సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. సోమవారం వరకు అరెస్ట్ చేయబోమని అడిషనల్ అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. దీంతో కేసు తదుపరి విచారణను హైకోర్టు ఈనెల 14కు వాయిదా వేసింది.