ట్రూ ఆఫ్ చార్జీలు, ఇతర చార్జీలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం మంగళగిరి నగరంలోని 5, 11 సచివాలయాలలోని అడ్మిన్ లకు సిపిఎం నేతలు వినతి పత్రాలు అందజేశారు. విద్యుత్ చార్జీలపై ఇతర చార్జీలు వేసి రెట్టింపు బిల్లులు ఇస్తున్నారని దీనివల్ల పేద వినియోగదారులకు నష్టం వాటిల్లుతుందని తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు పి. బాలకృష్ణ, డి. రామారావు, నరసింహారావు, హేమ సుందరరావు తదితరులు పాల్గొన్నారు.