శ్రీకాకుళం నగరంలోని శనివారం పలు రహదారుల పనులకు రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ పనులకు పది కోట్ల రూపాయలను ప్రభుత్వం వెచ్చించిందన్నారు. పాత శ్రీకాకుళంలో సంతోషీమాత గుడి దగ్గర నుంచి కిన్నెర థియేటర్ వరకూ రూ. 62 లక్షలతో రోడ్డు వేయనున్నట్లు ధర్మాన తెలిపారు. సంతోషిమాత గుడి దగ్గర నుంచి కలెక్టరేట్ కు రూ. 40 లక్షలతో రోడ్డు వేయనున్నామన్నారు.