తాడేపల్లి పరిధి ఉండవల్లి అయ్యప్ప స్వామి గుడి వద్ద నుండి గుంటూరు కెనాల్ వద్ద వరకు 2. 5 కిలోమీటర్ల మేర 11కేవీ విద్యుత్ లైన్ వెళ్తుందని ఈ లైన్లను కారణంగా తాము ఇల్లు కట్టుకోవడానికి ఇబ్బందిగా ఉందని స్థానికులు ఎమ్మెల్యే ఆర్కేకి అర్జీ రూపంలో తెలిపారు. దీంతో శనివారం విద్యుత్ శాఖ అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించి విద్యుత్తు లైన్లు మార్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని విద్యుత్ శాఖ ఎస్ఈ కి సూచించారు.