ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్-శ్రీకాకుళంరోడ్ మధ్య ప్రత్యేక రైలును నడపనున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం ఎకె త్రిపాఠి శనివారం తెలిపారు. సికింద్రాబాద్-శ్రీకాకుళం రైలు ఈనెల 14న రాత్రి 7. 30 గంటలకు సికింద్రాబాద్ లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9. 05 గంటలకు దువ్వాడ వస్తుందన్నారు. ఇక్కడి నుంచి 9. 07 గంటలకు బయ లుదేరి మధ్యాహ్నం 12. 30 గంటలకు శ్రీకాకుళం రోడ్ చేరుకుంటుందన్నారు.