ఓ వ్యక్తిని హత్యచేసిన ఘటనపై తండ్రి కొడుకులకు కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష విధించిందని కంచరపాలెం పోలీసులు శనివారం ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. 2014 సంవత్సరానికి సంబంధించి బర్మాక్యాంప్ ప్రాంతానికి చెందిన తండ్రికొడుకులు ఈశ్వరరావు శ్రీనులకు అదే ప్రాంతానికి చెందిన వెంకటరమణకుమధ్య ఆర్ధిక లావాదేవీలు ఉండడంతో వీరిమధ్య ఘర్షణ జరిగింది. దీంతో తండ్రి కొడుకులు వెంకటరమణను కొట్టడంతో తీవ్ర గాయాలై ఆస్పత్రిలో మృతి చెందాడు.