మమతా బెనర్జీ ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోడీ శనివారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పంచాయతీ ఎన్నికల సమయంలో ఆ పార్టీ రక్తంతో ఆడుకుందని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్లోని క్షేత్రీయ పంచాయితీ రాజ్ పరిషత్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తూ ‘టీఎంసీ నే ఖూనీ ఖేల్ ఖేలా హై’ అని పీఎం మోడీ హిందీలో అన్నారు. అంతేకాక ఆ పార్టీ ఓటర్లను బెదిరిస్తోందని, వారి జీవితాలను నరకం చేస్తోందని కూడా ప్రధాని ఆరోపించారు.