గంట్యాడలో దివంగత మాజీ ఎంపీ కొండపల్లి పైడితల్లినాయుడు కుటుంబీకులను శనివారం రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పరామర్శించారు. ఎంపీ సతీమణి అప్పయ్యమ్మ ఇటీవల మృతి చెందిన నేపథ్యంలో చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఎం. పీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య పలువురు వైకాపా ముఖ్య నాయకులు పాల్గొన్నారు.