బొబ్బిలి శనివారం ఆంధ్రప్రదేశ్ రెల్లి ఉప కులాల గ్రూపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర రెల్లి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు విజయ్ కుమార్ అధ్యక్షతన బొబ్బిలి పట్టణంలో గల ఆర్.సి.యం స్కూల్లో సమావేశం జరిగింది.రెల్లి కులస్తుల నాయకులు మాట్లాడుతూ రెల్లి కులస్తులు బలపడాలని,పిల్లలందరూ చదువుకొని మనకున్న రిజర్వేషన్లు మనం వినియోగించుకోవాలనిఉద్యోగాల్లోరాణించాలని వెనుకబాటు తనం నుండి ముందుకు రావాలని అవగాహన కల్పించారు.