ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా రాజ్యసభ నుంచి సస్పెండ్ అయ్యారు. నలుగురు ఎంపీల సంతకాలను ఫోర్జరీ చేశారని తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రమంలో ఆయనను సస్పెండ్ చేశారు. దీనిపై సభా హక్కుల కమిటీ దర్యాప్తు చేసి, నివేదిక ఇచ్చేంత వరకూ సస్పెన్షన్ కొనసాగుతుందని సభ స్పష్టం చేసింది. అనుమతి లేకుండా తమను దిల్లీ బిల్లు ప్రతిపాదిత కమిటీలో చేర్చారంటూ నలుగురు రాజ్యసభ ఎంపీలు ఫిర్యాదుతో ఆయనపై చర్యలు తీసుకున్నారు.