జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కుత్తుకలు కోసే దండుపాళ్యం బ్యాచ్కూ. వాలంటీర్లకు తేడా లేదు అంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఇళ్లలోకి దూరి గొంతుకలు కోస్తున్నారంటూ మండిపడ్డారు. నవరత్నాల కోసం ఏర్పాటు చేసుకున్న ప్రైవేటు సైన్యం ప్రజల ప్రాణాలు తీస్తుంటే ఎలా అని ప్రశ్నించారు. విశాఖలో వాలంటీర్ చేతిలో హత్యకు గురైన వరలక్ష్మి కుటుంబాన్ని పరామర్శించిన సందర్భంగా పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు.