విశాఖలో రుషికొండపై నిర్మిస్తోంది సచివాలయమేనని వైసీపీ తేల్చిచెప్పింది. సచివాలయం కోసమే అక్కడ భవనాలు నిర్మిస్తున్నట్లు ఆ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి శనివారం ట్వీట్ చేసింది. ‘ఉత్తరాంధ్రను అభివృద్ధి చేసేందుకు సీఎం జగన్, విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించి రుషికొండపై సచివాలయం నిర్మిస్తున్నారు. దానిపై కూడా టీడీపీ దుష్ప్రచారం చేస్తోంది. అభివృద్ధి ఆ పార్టీకి ఇష్టం లేనట్లుంది.’ అని పేర్కొంది.