కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన యువ అభ్యుదయ రైతు నందం రఘువీర్‌కు జాతీయ అవార్డు లభించింది. కేంద్ర వ్యవసాయశాఖ ఆదీనంలోని ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్స్ రైట్స్ అథారిటీ సంస్థ రెండేళ్లకు ఒకసారి వ్యవసాయ రంగంలో విశేష సేవలందిస్తున్న రైతులు, సంస్థలకు అవార్డులను ప్రదానం చేస్తుంది. 2023–25 ఏడాదికిగాను అత్యంత అరుదైన విత్తనాలను సంరక్షిస్తున్న కేటగిరీలో రఘువీర్‌ను ఈ అవార్డుకు ఎంపిక చేశారు.