అమెరికాలోని మిచ్గాన్కు చెందిన ఎరిన్ హనీకట్ అనే మహిళ పొడవైన గడ్డంతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కింది. 38 ఏళ్ల ఎరిన్ గత రెండేళ్లుగా నాన్‌స్టాప్‌గా గడ్డం పెంచుతూనే ఉంది. ప్రస్తుతం ఆమె గడ్డం పొడవు 30 సెం.మీ. లుగా ఉంది. దీంతో అతిపొడవైన గడ్డంతో భూమ్మీద జీవించి ఉన్న మహిళగా ఆమె రికార్డు నెలకొల్పింది. పాలిసిస్టిక్ ఓవెరియన్ సిండ్రోమ్(PCOS) కారణంగా ఎరిన్‌కు ఇలా జుట్టు పెరగడం మొదలైంది.