ఈ నెల 15వ తేదీన నిర్వహించే స్వాతంత్ర దినోత్సవ వేడుకల కోసం పక్కాగా ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ఆదివారం అనంతపురంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో 77వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణలో భాగంగా ముందస్తు ఏర్పాట్లను కేతన్ గార్గ్ పరిశీలించారు. ఈ సందర్భంగా మైదానంలో కలియ తిరిగి కార్యక్రమాలకు సంబంధించిన పనులను ఆయా శాఖ అధికారులకు సూచించారు.