అవయవ దానంతో ఎన్నో జీవితాల్లో వెలుగులు నింపవచ్చని ధర్మవరం పట్టణంలోని యువర్స్ ఫౌండేషన్ అధ్యక్షులు వై కే. శ్రీనివాసులు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రపంచ అవయవదాన దినోత్సవం సందర్భంగా వారు మాట్లాడుతూ యువర్ ఫౌండేషన్ సంస్థ ద్వారా ఇప్పటివరకు 220 మందితో నేత్రదానం స్వీకరించడం జరిగిందని, ఈ నేత్రాలను ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ కూడా పంపడం జరిగిందని, తద్వారా ఎన్నో జీవితాల్లో వెలుగులు నింపడం జరిగిందన్నారు.