పుట్లూరు మండలం శనగల గూడూరు గ్రామంలో ఆధునిక కాలంలోనూ అంటరానితనం చూపిస్తున్నారని ఆదివారం కెవిపిఎస్ , ఎమ్మార్పీఎస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కెవిపిఎస్ నాయకులు నల్లప్ప మాట్లాడుతూ ఇప్పటికి కూడా శనగల గూడూరు గ్రామంలో రెండు గ్లాసుల ధోరణి అవలంబిస్తున్నారని ఇది సరైన పద్ధతి కాదని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు కూడా అక్కడ పెత్తందారులకే వత్తాసు పలుకుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.