పులివెందుల పట్టణ పరిధిలో నీటి సరఫరాకు ఎక్కడా అంతరాయం లేకుండా చూడాలని మున్సిపల్ చైర్మన్ డాక్టర్ వరప్రసాద్ సిబ్బందికి సూచించారు. పులివెందుల పట్టణంలో ఆదివారం ఆయన మునిసిపల్ కమిషనర్వి వి నరసింహ రెడ్డితో కలిసి సచివాలయం అమేనిటి సెక్రెటరీలు మరియు నీటి సరఫరా సిబ్బందితో కలిసి సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పట్టణములో ఎక్కడేగాని నీటి సరఫరాకు అంతరాయం కలగకుండా విధులు నిర్వహించాలన్నారు.