రైల్వేకోడూరు మండలం విపిఆర్ కండ్రిక పంచాయతీ పరిధిలోని పొట్టిరాజు పల్లె రాజుల చెరువులో అక్రమంగా జెసిబితో మట్టి త్రవ్వకాలు జరిపి ఐదు ట్రాక్టర్లతో మూడు రోజుల నుంచి మట్టి తోలుతున్నట్లు స్థానికులు ఆదివారం సమాచారమిచ్చారు. ఇరిగేషన్ జేఈ రాజన్నకు సమాచారం అందించినా సెలవు దినం కావడంతో ఆపడం కుదరదన్నారు. మండలంలోని 15 చెరువులు కబ్జాకు గురై అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతూనే ఉన్నా ఇరిగేషన్ అధికారులు పట్టించుకోరు.