ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదివారం గోరఖ్నాథ్ ఆలయ ప్రాంగణంలో జాతీయ జెండాను ఎగురవేసి "హర్ ఘర్ తిరంగ" ప్రచారాన్ని ప్రారంభించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర ప్రజలు ఉత్సాహంగా పాల్గొనాలని ముఖ్యమంత్రి కోరారు. స్వాతంత్య్ర సమరయోధులు, సైనిక బలగాలు, కేంద్ర పోలీసు బలగాలు, పోలీసు శాఖ త్యాగధనుల బంధువులను జిల్లాల్లో సన్మానించడంతోపాటు కవి సమ్మేళనం, ముషాయిరాలు (కవి సమ్మేళనాలు) నిర్వహించనున్నట్లు తెలిపారు.