రోగులకు మెరుగైన వైద్య సేవలను తక్కువ ధరలకు అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఎయిమ్స్ వైద్యశాలను నిర్మించింది. అయితే సరైన విధానాలు అవలంబించకపోవడం రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల అబా యాప్ ద్వారా ఓపీ సేవలు బుకింగ్ చేసుకోవాలని సూచించారు. దీంతో సోమవారం మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రి వద్ద పలువురు రోగులు ఆందోళన నిర్వహించారు. అందరి వద్దా స్మార్ట్ ఫోన్ లో ఉండవు కాదా అని వృద్దులు ప్రశ్నిస్తున్నారు.