గుంటూరు రైల్వేస్టేషన్లో సోమవారం ఉ. 10గంటలకు ఏర్పాటు చేసిన ఆజాదికా అమృత్ మహోత్సవంలో భాగంగా ప్లాటుఫారం నెంబర్ 1లో ఫోటో ఎక్సిబిషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డి అర్ యమ్ పాల్గొని మాట్లాడారు. మోదీ ఇచ్చిన పిలుపు మేరకు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ప్రయాణికులతో ఇంట్రాక్టులో స్వాతంత్రం గురించి మాట్లాడారు. ఇప్పుడు మనం ప్రశాంతమైన జీవితం గడుపుతున్నామంటే ఎంతోమంది త్యాగ ధనుల పుణ్య ఫలమే అన్నారు.