చైనాలో వింత వివాహాలు పెరిగిపోయాయి. అక్కడ యువతి, యువకులు ఒక్కరోజు కోసమే వరుడు, వధువుగా మారుతున్నారు. ఈమధ్య కాలంలో చైనాలలోని యువకులకు పెళ్లి జరగడం అత్యంత కష్టంగా మారింది. అయితే పురుషులు బ్రహ్మచారులుగా మరణించడాన్ని అశుభంగా పరిగణిస్తారు. దీంతో యువకులు ఒక్కరోజు పెళ్లికి సిద్దమై.. తమ బ్రహ్మచర్యాన్ని వదిలించుకోవాలనుకుంటున్నారు. పెళ్లి తర్వాత వధువు తిరిగి తన ప్రాంతానికి వెళ్లిపోతుంది.