అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలో తెదేపా నేత మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అభిమానులు భారీ ర్యాలీ నిర్వహించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తాటాకు చప్పుళ్ళకు అక్రమ కేసులకు భయపడేది లేదని సోమవారం పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. అక్రమ కేసులతో మండిపల్లి వర్గాన్ని దెబ్బతీయలేరని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వెంకట రామి రెడ్డి, మాజీ సింగల్ విండో అధ్యక్షులు మండిపల్లి అభిమానులు పాల్గొన్నారు.