స్వాతంత్య్ర వేడుకల్లో ఉగ్రదాడులు జరగనున్నాయనే సమాచారం అందడంతో దేశ రాజధాని ఢిల్లీలో భద్రతా దళాలు అలర్ట్ అయ్యాయి. రైల్వే స్టేషన్లు, రద్దీగా ఉండే ప్రధాన రహదారులే లక్ష్యంగా దాడి చేయనున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది. లష్కరే-ఈ-తోయిబా(ఎల్ఈటీ), జైషే-ఈ-మహ్మద్‌కు చెందిన ఉగ్రవాదులే ఈ దాడులకు ప్లాన్ వేశారని ఇంటెలిజెన్స్ బృందాలు తెలిపాయి. దీంతో భద్రతా బలగాలు సెక్యూరిటీని కట్టుదిట్టం చేశాయి.