జాబిల్లిపై పరిశోధనలకు ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ – 3 సోమవారంతో నెల రోజులు పూర్తి చేసుకుంది. ఈ వ్యోమనౌక జాబిల్లికి మరింత చేరువైంది. బెంగుళూరులోని ‘ఇస్రో టెలిమెట్రీ, ట్రాకింగ్ కమాండ్ నెట్వర్క్’ నుంచి కక్ష్యను 150 కి.మీ X 177 కి.మీలకు తగ్గించినట్లు ఇస్రో తెలిపింది. తదుపరి కక్ష్య తగ్గింపు విన్యాసాన్ని ఆగస్ట్ 16న ఉదయం 8:30కు చేపట్టనున్నట్లు వివరించింది. ఈ నెల 23న సాయంత్రం ల్యాండర్ చంద్రునిపై అడుగుపెట్టనుంది.