పవన్ కల్యాణ్ చేస్తున్నవన్నీ అసత్య ఆరోపణలేనని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అన్నారు. సిరిపురం జంక్షన్ వద్ద పవన్ కల్యాణ్ మీడియా ముందు మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండించారు. గాజువాకలో ఓడిపోయిన పవన్ కల్యాణ్ తనకు తానుగా స్టేట్ రౌడీగా ఊహించుకుని ఫోజులిస్తున్నాడని, ఒక రౌడీకి ఉండాల్సిన లక్షణాలన్నీ పవన్ దగ్గరున్నాయ్.. ఒక వీధి రౌడీకి పవన్ కల్యాణ్‌కి తేడా ఏముంది..? అని ప్రశ్నించారు. రెండు నెలల క్రితం తన కుటుంబ కిడ్నాప్ వ్యవహారంలో గురించి చాలా క్లారిటీగా చెప్పినప్పటికీ దాన్ని వక్రీకరించే ప్రయత్నం చేయడం దురదృష్టకరమన్నారు. దాని వెనుక ఎవరూ లేరు.. కేవలం డబ్బు కోసం రౌడీషీటర్ చేసిన వ్యవహారం అని కూడా చెప్పానని గుర్తుచేశారు. పోలీసులు సకాలంలో స్పందించి ఎవరికి ప్రాణనష్టం లేకుండా మంచి డ్యూటీ చేశారని కూడా చెప్పానన్నారు.