పట్టిసీమ ప్రాజెక్టు ఎవరి డబ్బుతో కట్టారు..? ప్రభుత్వం డబ్బుతోనే కదా..? చంద్రబాబు ఇంట్లో సొమ్ముతో పట్టిసీమ కట్టారా..? అదేదో పగబట్టినట్లు వెంటాడుతోందని రామోజీ రావు కవిత్వం రాయడం దురదృష్టం. చంద్రబాబుకు మద్దతుగా రామోజీ చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే జాలేస్తుందని ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పట్టిసీమ ప్రాజెక్ట్ మొత్తం దోపిడీనే అన్నారు. ఈనాడు రామోజీరావు కక్షపూరితంగా కథనాలు ప్రచురిస్తోందదని, ఎల్లో మీడియా తప్పుడు కథనాలను నమ్మొద్దని ప్రజలకు సూచించారు. రామోజీరావు వైట్కాలర్ క్రిమినల్ అని చెప్పారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్, ఎల్లో మీడియానే దండుపాళ్యం బ్యాచ్ అని మంత్రి అంబటి అన్నారు.