అనంతపురం జిల్లా, గోరంట్ల మండలంలోని పుట్టగుండ్లపల్లిలో విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్ళితే.... పుట్టగుండ్లపల్లిలో నరసింహప్ప, నంజమ్మ దంపతులు ఒంటరిగా జీవనం సాగిస్తున్నారు. ఇటీవల నరసింహప్ప ప్రమాదవశాత్తు పడి ఎడమకాలు మక్కి విరిగింది. భార్య నాటువైద్యం ద్వారా కట్టు కట్టించి మంచెంపైనే ఇంటివద్ద సపర్యలు చేస్తోంది. భర్తకు మూర్ఛవ్యాధి ఉండటంతో నంజమ్మ మందులకోసం గోరంట్లకు మంగళవారం వెళ్లింది. నరసింహప్ప తాగి పడేసిన బీడీ ముక్క పరుపుపై పడి నిప్పురగిలింది. అక్కడ ఎవరూ లేరు. ఆలస్యంగా భార్య గుర్తించింది. గాయపడిన నరసింహప్పను గోరంట్ల ప్రభుతాసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్సలు జరిపారు. మెరుగైన వైద్యం కోసం 108లో హిందూపురం తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. కేసు నమోదుచేసి శవాన్ని పెనుకొండ ఆస్పత్రికి తరలించినట్లు సీఐ సుబ్బరాయుడు తెలిపారు.