జనసేన అధ్యక్షులు పవన్‌కల్యాణ్ నేడు అనగా బుధవారం భీమిలి నియోజకవర్గ పరిధిలో గల ఎర్రమట్టి దిబ్బలను సందర్శించనున్నారు. మూడో విడత వారాహి యాత్రలో భాగంగా ఈ నెల పదో తేదీన నగరానికి విచ్చేసిన ఆయన ఇక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొని స్వాతంత్య్ర దినోత్సవం కోసం మంగళగిరి వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు విశాఖపట్నం వస్తారు. నోవాటెల్ నుంచి బీచ్‌రోడ్డులో రుషికొండ మీదుగా చేపలుప్పాడ, ఐఎన్ఎస్ కళింగ, జేవీ అగ్రహారం మీదుగా ఎర్రమట్టి దిబ్బలకు వెళతారని పార్టీ నేతలు తెలిపారు.