టీడీపీ అధినేత చంద్రబాబు మంగళవారం సాయంత్రం విశాఖ నగరంలోని ఆర్కే బీచ్ రోడ్డులో చేపట్టిన టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ‘విజన్-2047’ డాక్యుమెంట్ను విడుదల చేసేందుకు ఆయన మంగళవారం సాయంత్రం విశాఖ వచ్చారు. విమానాశ్రయం నుంచి నేరుగా ఆర్కే బీచ్ రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. ముందుగా జాతిపిత గాంధీజీ చిత్రపటానికి, అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తర్వాత 5.31 గంటలకు భారీ జాతీయ పతాకం చేబూని పాదయాత్ర ప్రారంభించారు. అప్పటికే బీచ్ రోడ్డుకు వేలాదిగా చేరుకున్న యువతీయువకులు, విద్యార్థులు, న్యాయవాదులు, వివిధ వర్గాలు, రంగాలకు చెందిన ప్రముఖులు, రైతులు, నగర వాసులు, తెలుగుదేశం అభిమానులు ఆయన వెంట నడిచారు.