శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్ కార్యాలయంలో ప్రొటోకాల్ ప్రకారం మున్సిపల్ కార్యాలయంలో జెండా ఆవిష్కరించేందుకు చైర్‌పర్సన్ ఇంద్రజ ఉదయం 7.00 గంటలకే మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. జెండా ఆవిష్కరణ కార్యక్రమం కోసం మున్సిపల్ కమిషనర్, ఏఈ జనార్దన్‌లకు ఫోన్ చేస్తే స్పందించలేదు. 8.30 గంటలైనా అధికారులెవరూ రాలేదు. దీంతో చైర్‌పర్సన్ తీవ్ర ఆవేదన చెంది అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆమె వెళ్లిపోయాక కమిషనర్ వచ్చారు. 8.57 గంటలకు జెండా కట్టారు. అదే సమయానికి వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త దీపిక, మున్సిపల్ వైస్ చైర్మన్ బలరాంరెడ్డి వచ్చారు. సమన్వయకర్త దీపిక జెండా ఎగురవేశారు. చైర్‌పర్సన్ అందుబాటులో లేకపోతే స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలు జెండా ఎగురవేయాలి. వారెవరూ లేకపోతే వైస్ చైర్మన్ జెండాను ఆవిష్కరించొచ్చు. అలాంటిది ఏ హోదాలేని దీపిక జెండా ఆవిష్కరించారు.