రాజధానులను మూడు ప్రాంతాల హక్కుగా చేయబోతున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. రాష్ట్రంలోని 13 జిల్లాలకుతోడు మరో 13 జిల్లాలు ఏర్పాటు చేశామన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో గత ప్రభుత్వ తప్పిదాలు, సాంకేతిక సమస్యలను అధిగమించామని, ప్రస్తుతం పనులు వడివడిగా జరుగుతున్నాయని జగన్ తెలిపారు. 2025 జూన్ నాటికి ప్రాజెక్టును పూర్తిచేసి జాతికి అంకితం చేస్తామన్నారు. గడచిన 76ఏళ్ల స్వతంత్ర భారతంలో మరే ప్రభుత్వమూ చేయని విధంగా వ్యవసాయం, విద్య, వైద్యం, మహిళా సాధికారత, పారిశ్రామిక రంగాలతోపాటు సామాజికవర్గాల పరంగా గొప్ప మార్పులు తీసుకొచ్చామని తెలిపారు.