నెహ్రూ మ్యూజియం పేరు మార్చడంపై కాంగ్రెస్ నాయకుడు సందీప్ దీక్షిత్ స్పందించారు. ఇది సంకుచిత మనస్తత్వమని విమర్శించారు. మొదటి ప్రధాని అయిన నెహ్రూను గుర్తు చేసుకునేందుకు దానికి ఆయన పేరు పెట్టామని చెప్పారు. కేంద్రం ఇతర ప్రధానుల గుర్తుగా ఏదైనా నిర్మించాలంటే.. నిర్మించొచ్చని, కానీ ఇలా చేయకూడదని తెలిపారు. దీన్ని బట్టి ఇది భారత బంగారు చరిత్రను తుడిచేసే ప్రయత్నమని తెలుస్తోందని మండిపడ్డారు.