పుంగనూరు అల్లర్ల కేసుపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. కొద్దిరోజుల క్రితం పుంగనూరులో టీడీపీ, వైసీపీ శ్రేణులు దాడులు చేసుకున్న విషయం తెలిసిందే. వీరి దాడిలో పదుల సంఖ్యలో పోలీసులు గాయపడగా.. కానిస్టేబుల్ కంటిచూపు కోల్పోయారు. ఈ ఘటనపై ఇప్పటికే చంద్రబాబు సహా అనేక మంది టీడీపీ నేతల మీద కేసు నమోదైంది. ఈ కేసులో చంద్రబాబు A1గా ఉన్నారు.