కరోనా నుంచి కోలుకున్నామని అనుకునేలోపే ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక అందరినీ కలవరానికి గురి చేస్తోంది. ఈజీ – 5 కొత్త వేరియంట్ వ్యాప్తి చెందుతోందని పేర్కొంది. ఇప్పటికే 51 దేశాల్లో దీన్ని గుర్తించినట్లు పేర్కొంది. ఈ వేరియంట్ ఒమిక్రాన్ పరివర్తనమని, కరోనా నిర్ధారణ పరీక్షల్లో అలసత్వం వద్దని ప్రపంచ దేశాలను హెచ్చరించింది. అయితే, ఈ వేరియంట్ మిగతా వాటికన్నా తక్కువగానే వ్యాప్తి చెందుతుందని తెలిపింది.