కడప జిల్లాలో జిల్లాలో అయిదుగురు అంతర్ జిల్లా సైబర్ మోసగాళ్లను బుధవారం అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పి అన్బురాజన్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బు కొట్టేస్తున్న ప్రకాశం, గుంటూరు జిల్లాలకు చెందిన ఐదుగురు సైబర్ మోసగాళ్లను అరెస్టు చేసి నిందితుల నుంచి నకిలీ వేలిముద్రలు తయారుచేసే సామాగ్రి స్వాధీనం చేసుకుని ముద్దాయిల 12 అకౌంట్లను సీజ్ చేసి ఈడీకి పంపుతున్నట్లు తెలిపారు.