విద్యుత్ శాఖలో ఉత్తమ సేవలు అందించిన పి. శివకుమార్ కు ఉత్తమ జేఎల్ఎం గ్రేడ్ 2 అవార్డు బుధవారం వరించింది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విద్యుత్ శాఖ జోన్ 3 పరిధిలో అంకితభావంతో పనిచేస్తున్న శివకుమార్ కు సూపరింటెండెంట్ ఇంజినీర్ మహేంద్ర నాథ్ ప్రతిభ పురస్కార ప్రశంసా పత్రం అందించారు. ఈ సందర్భంగా జోన్ 3 ఎక్జిక్యూటివ్ ఇంజినీర్ పోలాకి శ్రీనివాసరావు, పిఎంపాలెం అధికారులు, సిబ్బంది తదితరులు అభినందించారు.